Home » ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ

ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ

by Admin
430Views

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కౌన్సిలర్ అశోక్ ఆధ్వర్యము లో వార్డు కార్యాలయం రామంతాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅథితి గా మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్,  మంత్రి కేటీఆర్ లకు అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. అదేవిధంగా దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింది అని బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు.. బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తుదన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు వెంకట్ రెడ్డి, జె.రాధయ్య, జె.రాములు, జె మల్లయ్య, బి.శ్రీనివాస్, పి.శేఖర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment