
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఆదివారం హఫీజ్ పేట్ లో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. జయశంకర్ ఆశయాల సాధానకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగారం సంగారెడ్డి, సాయి అన్న, ఉమేష్, దేవేందర్, సిల్వర్ మనీష్, నార్ని సురేష్, పద్మ మోహిని, వెంకటరమణ, మునాఫ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.