Home » ఆకర్షణీయమైన వోల్వో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్స్ ను తెలంగాణలో ఆవిష్కరించిన వోల్వో కార్ ఇండియా

ఆకర్షణీయమైన వోల్వో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్స్ ను తెలంగాణలో ఆవిష్కరించిన వోల్వో కార్ ఇండియా

by Admin
1.0kViews

 

*పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్స్ ను తెలంగాణలో ఆవిష్కరించిన వోల్వో కార్ ఇండియా

*ఆకర్షణీయమైన వోల్వో సర్వీస్ ప్యాకేజ్ తో నూతన S90 & నూతన XC60

*త్వరలో XC90 పెట్రోల్ వాహనం ఆవిష్కారం

*ఈ నూతన కార్లతో వచ్చే నూతన సాంకేతికతల్లో గూగుల్ సర్వీసెస్, అధునాతన ఎయిర్ క్లీనర్ & వోల్వో కార్స్ యాప్ లాంటివి ఉన్నాయి.

తెలంగాణ మిర్రర్,హైదరాబాద్: తెలంగాణ లోని లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు అత్యుత్తమ అంతర్జాతీయ సాంకేతికతలను అందించేందుకు వోల్వో కార్ ఇండియా బుధవారం రెండు నూతన పెట్రోల్ మైల్డ్ – హై బ్రిడ్ మోడల్స్ – లగ్జరీ సెడాన్ S90, వోల్వో బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ లగ్జరీ ఎస్ యూవీ XC60- లను మా ర్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2021 చివరి నాటికి పెట్రోల్ పోర్ట్ ఫోలియోను పూర్తి చేయాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని వోల్వో కార్ డీలర్ షిప్ కృష్ణా వోల్వో బంజారాహిల్స్ లో ఈ ఆవిష్కరణ జరిగింది. నూతన పెట్రోల్ మైల్డ్ – హైబ్రిడ్ వోల్వో S90 వెల రూ. 61,90,000, ఎక్స్- షోరూమ్. నూతన పెట్రోల్ మైల్డ్ – హైబ్రిడ్ వోల్వో XC60 వెల రూ.61,90,000, ఎక్స్- షోరూమ్. ఈ రెండు మోడల్స్ కూడా అధునాతన ఫీచర్లతో ఉంటాయి. వోల్వో డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపరుస్తాయి. గూగుల్ అసిస్టెంట్ తో హ్యాండ్స్ – ఫ్రీ సహాయాన్ని అందించే గూగుల్ యాప్స్, ఇతర యా ప్స్, సర్వీసెస్ కి యాక్సెస్ అందించే డిజిటల్ సర్వీసెస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా అధునాతన నావిగేషన్ వంటివి రెండు మోడల్స్ లో కూడా లభిస్తాయి. కొనుగోలుదారులకు తిరుగులేని విధంగా వ్యక్తిగతీకరణ, అసమాన కనెక్టివిటీని అందించే రేపటి తరం ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ను కూడా ఈ కార్లు కలిగిఉంటాయి.  నూతన పెట్రోల్ మైల్డ్ – హైబ్రిడ్ కార్లు, నూతన సాంకేతికతలకు తోడుగా కంపెనీ రూ.75,000 ప్రత్యేక ధర (వర్తించే పన్నులు అదనం)కు 3 ఏళ్ల వోల్వో సర్వీస్ ప్యా కేజ్ ను కూడా ప్రకటించింది. నూతనంగా ఆ విష్కరించబడిన కార్లతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత పండుగ సీజన్ సందర్భంగా పరిచయ ఆఫ ర్ గా దీన్ని అందిస్తున్నారు. మూడేళ్ల పాటు రెగ్యులర్ మెయింటెనెన్స్, అరుగుదల వ్యయాలు ఇందులో కలిసి ఉంటాయి. ఈ సందర్భంగా వోల్వో కార్ ఇండియా సేల్స్ హెడ్  ప్రకాశ్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ మాకు ఎంతో ముఖ్యమైన మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉంది, ఆకాంక్షాపరులైన, సంపన్న కుటుంబాలకు నిలయం. కొనుగోలుదారులకు అత్యుత్తమ అనుభూతులను అందించేందుకు వోల్వో కార్స్ కట్టుబడి ఉంది. కార్ తో కొనుగోలుదారు చేసే యావత్ ప్రయాణంలో అత్యుత్తమ కస్టమర్ అనుభూతిని అందిస్తుంది. తెలంగాణలో విలాసవంతమైన మొబిలిటీ కస్టమర్ ఎప్పుడూ సురక్షిత గురించి, కారు అందించే ఫీచర్ల గురించి ఆలోచిస్తుంటారు. సాంకేతికతతో కూడిన మా నూతన ఆఫర్లు ఎంతో ఆనంద దాయకమైనవని కొనుగోలుదారులు భావిస్తారని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు. గూగుల్ యాప్స్, సర్వీసెస్ తో కూడిన ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ ను అందించేందుకు వోల్వో కార్ గ్రూప్ గూగుల్ తో జట్టు కట్టింది. సురక్షిత, సుస్థిరదాయకతలకు వోల్వో కట్టుబడి ఉంది.

S90 అనేది ఓల్వో ప్రీమియం 4 – డోర్, 5 సీట్ ప్లాగ్ షిప్ సెడాన్. ఇది ఓల్వో అధునాతన మాడ్యులర్ వె హికల్ ప్లాట్ ఫామ్ అయిన స్కేలబుల్ ప్రోడక్ట్ ఆర్కిటెక్చర్ (ఎస్ పిఎ)పై నిర్మితమైంది. బోరన్ స్టీల్ విస్తృత వినియోగించడం వంటి వాటితో ఎస్పీఏ ప్లాట్ ఫామ్ నుంచి అత్యంత పటిష్ఠమైన వోల్వో కార్లు రూపుదిద్దు కున్నాయి. అదే విధంగా కారు లోపల, బయట ఉండే వారి రక్షణకు వీలుగా పలు సురక్షిత వ్యవస్థల ని ర్మాణం వంటివి కూడా ఉన్నాయి.

2018లో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ ను అత్యంత ప్రజాదరణ పొందిన XC60 గెలుచుకుంది. అదే ఇప్పుడు వోల్వో కార్ అధునాతన అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడిఎఎస్) సెన్సర్ ప్లాట్ ఫామ్ వంటి అ ధునాతన సురక్షితతో అప్ గ్రేడ్ అయింది. ఎడిఎఎస్ అనేది ఆధునిక సురక్షిత వ్యవస్థ. రాడార్స్, కెమెరా లు, అల్ట్రాసోనిక్ సెన్సర్స్ తో కూడుకొని ఉంటుంది.

*నూతన కార్ల ముఖ్య నిర్దేశకాలు:

నూతన ఎస్90 బి5 ఇన్ స్క్రిప్షన్ (పెట్రోల్ మైల్డ్ – హైబ్రిడ్)

నూతన ఎక్స్ సి 60 బి5 ఇన్ స్క్రిప్షన్ (పెట్రోల్ మైల్డ్ – హైబ్రిడ్)

సామర్థ్యం: 1969 cc

గరిష్ఠ అవుట్ పుట్: 250 hp

గరిష్ఠ టార్క్: 350 Nm

ఆటోమేటిక్ 8-స్పీడ్ FWD (S90)

ఆటోమేటిక్ 8- స్పీడ్ AWD (XC60)

పిఎం 2.5 సెన్సర్ తో అధునాతన ఎయిర్ క్లీనర్.

ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ (గూగుల్ సర్వీసెస్ తో).

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్.

పైలట్ అసిస్ట్.

లేన్ కీపింగ్ ఎయిడ్.

క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.

కొలిషన్ మిటిగేషన్ సపోర్ట్ (ఫ్రంట్).

కొలిషన్ వార్నింగ్ మరియు మిటిగేషన్ సపోర్ట్ (రియర్).

360 డిగ్రీ కెమెరా.

పార్కింగ్ అసిస్టెన్స్ (ఫ్రంట్, రియర్ & సైడ్).

భారతదేశంలో వోల్వో కార్లు:

స్వీడిష్ లగ్జరీ కార్ కంపెనీ అయిన వోల్వో భారతదేశంలో 2007లో తన ఉనికి ఏర్పరచుకుంది. నాటి నుంచి కూడా దేశంలో స్వీడిష్ బ్రాండ్ ను మార్కెట్ చేసేందుకు ముమర్మంగా ప్రయత్నించింది. వోల్వో కార్స్ ప్రస్తుతం 24 డీలర్ షిప్స్ ద్వారా తన ఉత్పాదనలను అందిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, దిల్లీ ఎన్సీఆర్- దక్షిణ దిల్లీ, పశ్చిమ దిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, రాయ్‌పూర్, జైపూర్, కొచ్చి, కోజికోడ్, కోల్‌కతా, ల క్నో, లూథియానా, పశ్చిమ ముంబై, దక్షిణ ముంబై, పూణే, రాజ్‌కోట్, రాయ్‌పూర్, సూరత్, విశాఖపట్నం, విజయ వాడ వీటిలో ఉన్నాయి.

You may also like

Leave a Comment