
శేరిలింగంపల్లి,తెలంగణా మిర్రర్ : మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా మూడో రోజు సందడిగా సాగింది. కోల్ కతా నుండి విచ్చేసిన కళాకారులు జ్యూట్ వాల్ హ్యాంగింగ్స్, డాల్స్, చెప్పులు, డెకరేటివ్ ఉత్పత్తులను స్టాల్స్ లో అమ్మడానికి ఉంచారు. జాంధానీ చీరలు, బీహార్ టుస్సార్ పట్టు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండ్లూమ్ కాటన్ షర్ట్స్, గుజరాతి శాలువాలు, గాగ్రా డ్రెస్సులు, హ్యాండ్ బాగ్స్, లేదర్ బ్యాగ్స్ ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి.సాయంత్రం హంపి థియేటర్ లో కుమారి జ్యోతిర్మయి పట్నాయక్ గారి బృందం ప్రదర్శించిన ఒడిసి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా క్రి .శే ఇందిరా ముసునూరి శిష్య బృందం మూషిక వాహన, దీపాంజలి, వినాయక కౌతం, వేంకటాచల నిలయం, వందేమాతరం , మొదలైన అంశాలను కళాకారులు సాత్విక, యోగీతాశ్రీ, యుక్త, సరయు, తన్వి కృతి నాయన ప్రదర్శించి ఆకట్టుకున్నారు.