Home » అహర్నిశలు ప్రజల కొరకు శ్రమిస్తా…ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

అహర్నిశలు ప్రజల కొరకు శ్రమిస్తా…ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

by Admin
8.6kViews
64 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అహర్నిశలు ప్రజల కొరకు శ్రమిస్తానని స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ పరిధిలోని హుడా కాలనీ, జనప్రియ నగర్ ఫేస్ 5 కాలనీ లో కాలనీ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కాలనీలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో వేల కోట్లతో వ్యయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు వంటి అనేక గొప్ప కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోహర్ గౌడ్, లక్ష్మారెడ్డి, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్,మిద్దెల మల్లారెడ్డి, ఉరిటీ వెంకట్ రావు,ప్రవీణ్, ప్రసాద్, రవీందర్ రెడ్డి, రాజు యాదవ్, తిరుమలేష్ ,సిద్ధి రాములు, లక్ష్మీ, మాధవి,రాదమ్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment