
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : అల్లూరి సీతారామరాజు భావజాలాన్ని నేటి యువత అలవర్చుకోవాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ బండి రమేష్ పిలుపునిచ్చారు.మంగళవారం అల్లూరి సీతారామరాజు 126 వ జయంతి వేడుకలను మియాపూర్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బండి రమేష్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు దేశ పరిస్థితులను అధ్యయనం చేసి అనేక ప్రదేశాల్లో తిరిగి ప్రజలు పడుతున్న కష్టాలను ఆకలింపు చేసుకుని ముఖ్యంగా గిరిజనులు పడుతున్న కష్టాలు గిరిజనులపై బ్రిటిష్ ముష్కర లు చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఎంచుకుని బ్రిటిష్ వారిని గడగడ లాడించారని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్ ,శేఖర్ గౌడ్ , కాకర్ల అరుణ, సత్యారెడ్డి , అంజద్ అమ్ము, రవణ, సత్తయ్య , ఉమేష్ పాల్గొన్నారు.