
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ లాంఛనంగా ప్రారంభించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,మండల విద్యాధికారి వెంకటయ్య, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషాకాహారం అందివ్వాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకమని విప్ గాంధీ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని విప్ గాంధీ గుర్తు చేశారు. అదే విధంగా ఉదయం పూట కూడా నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.