
10.7kViews
105
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో అల్ ఇండియా శారీ మేళ బతుకమ్మ ముగింపు ఉత్సవం సందర్బంగా శ్రీ నారాయణి నాట్యాలాయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.ఈ ప్రదర్శనలో పుష్పాంజలి, అలరిపు , గణేశా కౌతం, జతిస్వరం, శబ్దం, దశావతారం, కీర్తనం, కృతి, తిల్లాన, మంగళం అంశాలను కళాకారులు అంకిత, పద్మ, భవ్య, హర్షిత, పియుషి, శరణ్య, రుచిత, వృందా , ఐశ్వర్య, సహస్ర,సిరిచందన, మిశ్క, పార్వతి, జనని, సోమా ప్రదర్శించి మెప్పించారు. ఈ కార్యక్రమానికి సంజయ్ జోషి కథక్ నాట్య గురువులు, రాజేంద్ర నియతి భరతనాట్యం గురువర్యులు, డాక్టర్ విజయపాల్ కూచిపూడి నాట్య గురువులు, డాక్టర్ ఆదిత్య కిరణ్ సంగీత గురువర్యులు ముఖ్య అతిధులుగా హాజరై కళాకారులను అభినందించారు.