
శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నా వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 4 ,29,500/- ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను కార్పొరేటర్లు రోజా దేవి రంగరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా అరెకపుడి గాంధీ మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి…
1.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కి చెందిన శకుంతల కి – 60,000/-
2. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన పార్వతి కి – 60,000/-
3.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కి చెందిన లక్ష్మణ్ కి – 60,000/-
4.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన దుర్గ కి – 51,000/-
5.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన చంద్ర లీల కి – 50,000/-
6.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కి చెందిన రాంరెడ్డి కి – 48,000/-
7.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి టవర్స్ కి చెందిన సుందరి కి – 46,500/-
8.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన వెంకటయ్య కి – 34,000/-
9.హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన చుక్కారెడ్డి కి – 20,000/-
రూపాయలుగా మంజూరి అయినవి ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పోతుల రాజేందర్, శ్రీనివాస్ చౌదరి ఎల్లంనాయుడు, తిరుపతి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.