
1.1kViews
తెలంగాణ మిర్రర్, కొండాపూర్: తెలంగాణ లో తీసుకువచ్చిన వృధ్యాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించిన విషయం తెలిసిందే. అదేసమయంలో పింఛన్ మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.2,116లకు పెంచిన ప్రభుత్వం. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు అందించాలని ప్రభుత్వం భవించిందని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. ఈ పెన్షన్ దరఖాస్తు అఖరు తేదీ ఈ నెల 30వ వరకు ఉందని, అర్హులైన దరఖాస్తుదారులే నేరుగా దగ్గరలో ఉన్న ఈ- సేవా కేంద్రానికి వెళ్లి, దరఖాస్తు చేసుకోగలరని ఆయన కోరారు. కావున ప్రజలందరూ గమనించి అందుకు కావాల్సిన పత్రాలను తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.