Home » అరెకపూడి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : అరెకపూడి శ్యామలాదేవి

అరెకపూడి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : అరెకపూడి శ్యామలాదేవి

by Admin
12.5kViews
64 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని చూసి అరెకపూడి గాంధీని మరొక్కసారి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధిలోని కేఎస్ఆర్ ఎన్క్లేవ్ కాలనీ, పలు కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలకు మారుపేరుగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని మూడో సారి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ప్రతి పక్షాల మాటలను నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటాన్నారని తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి అరెకపూడి గాంధీ కృషి చేశారని,మరోసారి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించి మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment