
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సమక్షంలో వారు బీఆర్‌ఎస్‌లో చేరారు.హఫీజ్ పెట్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై,శేరిలింగంపల్లిలో తానూ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీ ఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు మరియు వివిధ కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ముఖ్య నాయకులు జీవన్, ధను, సంతోష్ , శేఖర్ ,మల్లేష్, సాయి కుమార్,కమల్, జాన్సన్, ఉమ సాయి, నవీన్, భాస్కర్,కిరణ్, సంతు,ప్రశాంత్,సురేష్, సునీల్, దుర్గ రావు, నరేష్ ,హరిప్రసాద్, శ్రీనివాస్ మరియు తదితరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.