Home » అమీన్‌పూర్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

అమీన్‌పూర్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

by Admin
390Views

*మున్సిపల్ కార్యాలయం,వార్డులు,కాలనీలలోజాతీయ జెండాను ఎగుర వేసిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి 

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం,వార్డులు,కాలనీలలో మువ్వన్నెల జెండాలతో రెప‌రెప‌లాడాయి.ఈ సందర్బంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆయా కాలనీల ప్రజాప్రతినిధులు,తెరాస నాయకులు,కార్యకర్తలు,వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని,సామ్యవాదలౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 72 ఏళ్ళుపూర్తి చేసుకొని 73 లో అడుగుపెడుతున్నామని అన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కి అనుగుణంగా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు.

You may also like

Leave a Comment