
1.2kViews
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అమీన్‌పూర్ మున్సిపల్ ను పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు.గురువారం మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో రూ.40 లక్షలతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు,ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు.అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్,కౌన్సిలర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కాలనీవాసులు పాల్గొన్నారు.