Home » అమీన్‌పూర్ అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే జి ఎమ్ ఆర్ ను కోరిన చైర్మన్ టిపిఆర్

అమీన్‌పూర్ అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే జి ఎమ్ ఆర్ ను కోరిన చైర్మన్ టిపిఆర్

by Admin
550Views

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గురువారంఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు.అమీన్‌పూర్ మున్సిపల్ పాలకమండలి ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన సర్వ సభ్యసమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా శాసన సభ్యులు జిఎమ్ఆర్ ను కౌన్సిల్ తరపున చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ టి పి ఆర్ రెండేళ్ల ప్రగతి నివేదికను వివరించారు..అమీన్‌పూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించాలని,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం,అంతర్గత రహదారులు, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment