Home » అమరవీరులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర నివాళులు

అమరవీరులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర నివాళులు

by Admin
9.7kViews
73 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :   పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌.

You may also like

Leave a Comment