Home » అభివృధ్ధికోసం బీజేపీ ని గెలిపించాలి : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అభివృధ్ధికోసం బీజేపీ ని గెలిపించాలి : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Admin
9.0kViews
130 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధలో గల నల్లగండ్ల లోని అపర్ణ సైబర్ జోన్,అపర్ణ సైబర్ కమ్యూన్ ,అపర్ణ సైబర్ లైఫ్, అపర్ణ సరోవర్, మంజీరా డైమండ్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించిన సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్,కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాల్లో మార్పు రావాలంటే బిజెపి గెలవాలని, దేశం గర్వించదగ్గ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో ప్రపంచం లోనే భారత దేశం విశేష ఖ్యాతి పొందిందన్నారు. . తెలంగాణ లోను ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ సీట్లు సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కి స్థానికుడైన రవికుమార్ యాదవ్ ను గెలిపిoచాలని కోరారు. ఈ నెల 30 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని, తండ్రి బిక్షపతి యాదవ్ వరసత్వాన్ని పునికి పుచ్చుకొన్న వ్యక్తి గా, యువకుడిగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యం తో రాజకీయం లోకి వచ్చిన రవన్న లాంటి వ్యక్తులను గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తే మనకు మంచి పాలకులు వస్తారని,ముఖ్యంగా యువకులు బాధ్యత తీసుకోవాలన్నారు. మనకు అండగా ఉండే వ్యక్తి సేవలు మనం వినియోగించు కోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అపర్ణ సైబర్ జోన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, అపర్ణ సైబర్ కమ్యూన్ అధ్యక్షులు అమిత్ జైన్, అపర్ణ సైబర్ లైఫ్ అధ్యక్షులు సుబ్రమణ్యం,అపర్ణ సరోవర్ అధ్యక్షులు సతిండర్ రెడ్డి, మంజీరా డిమాండ్ టవర్స్.అధ్యక్షులు ప్రసాద్ గారు,అపర్ణ సైబర్ జోన్. అపర్ణ సైబర్ కమ్యూన్, అపర్ణ సైబర్ లైఫ్,అపర్ణ సరోవర్,మంజీరా డైమండ్ టవర్స్ కమిటీ మెంబెర్స్, గేటెడ్ కమ్యూనిటీ వాసులు, స్థానిక నేతలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment