Home » అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
12.0kViews
87 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ ను నియోజకవర్గంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.శనివారం డివిజన్ పరిధిలోని వెంకట్ రెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను,డ్రైనేజీ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను,కాంట్రాక్టర్ కు కార్పొరేటర్ రాగం సూచించారు.నియోజకవర్గంలోనే శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, జయంత్ కుమార్ సర్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, అశోక్, రమణ గౌడ్, మధు గౌడ్, అజర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment