Home » అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

by Admin
11.0kViews
116 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిర నగర్ లో నూతనంగా చేపట్టిన బాక్స్ డ్రైనేజీ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షా కాలంలో కాలనీలు ముంపుకు గురి కాకుండా నాలాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారని ..నాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం బాక్స్ డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు..చందానగర్ డివిజన్ పరిధిలో కాలనిలలో మౌళిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంతి, డిఇ, ఏఈ ,చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి బిఆర్ఏస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, అమంజద్, అప్సర్,గిరి తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment