
410Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.డివిజన్ పరిధిలోని పి ఏ నగర్,హెచ్ ఎం టి కాలనీలో పాస్టర్ రత్నంతో కలిసి అర్హులైన పేద క్రిస్టియన్లకు గురువారం క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించి ప్రతి పేదవాడు తమ పండుగలను ఘనంగా జరుపుకునే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రామచంద్ర, జీతయ్య, చంద్రయ్య, బిక్షపతి కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.