
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్వెంకట్ రెడ్డి కాలనీ, బృందావన్ కాలనీ, భాగ్యలక్ష్మి కాలనీ,శిల్ప గార్డెన్ ,సెంట్రల్ పార్క్ ఫేస్ 2 కాలనీలలో రూ.8 కోట్ల 46 లక్షల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు.అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కార్పొరేటర్ రాగం మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ సహకారంతో డివిజన్ నుఅన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.