
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అతివేగంతో వచ్చి కారును టిప్పర్ ఢీ కొట్టిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.దీనికి సంబదించిన వివరాలు పోలీసులు వెల్లడించారు.బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ నుండి బీరంగూడం వెళ్తున్న స్పైజెట్ విమాన ఉద్యోగి గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ఇర్ఫాన్ హష్మీ తన విధులు ముగించుకొని తన నివాసం ఉండే బీరంగూడ కు తన ఆల్టో కారులో వస్తుండగా శేరిలింగంపల్లి మండల కార్యాలయం వద్దకు రాగానే తన వెనకాల వేగంగా వస్తున్న యుసి టి.ఎస్ 15 నెం. 6069 గల టిప్పర్ వాహనం అరబిందో కన్స్ట్రుక్షన్ కంపెనీ వద్ద వేగంగా ఢీ కొట్టింది.దీంతో కారు పల్టీ కొట్టడంతో కారులో ఉన్న ఇర్ఫాన్ హష్మీ కి శరీరానికి, మెడకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఇమ్రాన్ హష్మీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.అనంతరం సంఘటన పై పోలీసులు సమాచారం ఇచ్చారు.ఐయితే టిప్పర్ డ్రైవర్ వడ్డెర నగేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.