
1.4kViews
హైదరాబాద్ (తెలంగాణ మిర్రర్) : సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నిధి అగర్వాల్. అందం,అభినయం కలగలిపి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ యంగ్ టాలెంట్ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈరోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరి హర వీరమల్లు టీమ్ నిధి పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో నిధి పంచమి పాత్రలో తళుక్కుమననుంది.