తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : తెలంగాణ హకీ రాష్ర్ట సర్వసభ్య సమావేశంలో అన్ని ఉమ్మడి జిల్లాల హకీ ఆద్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ర్ట హకీ క్రీడ అబివృద్దితో పాటు క్రీడాకారులకు మరిన్ని సదుపాయాలు, హకీ ప్రామాణ్యాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో హక ప్రాదాన్యత పెంచాలని హకీ అంతర్జాతీయ క్రీడాకారుడు , తెలంగాణ హకీ సెక్రటరీ ముఖేశ్ తెలిపారు. తమ అసోసియేషన్ చైర్మెన్ గా 2 సంవత్సారాలు పదవి కాలం పూర్తి చేసుకోవడం, పదవి కాలంలో హకీ అభివృద్ధి కృషి చేయడం పట్ల విజయ ను అభినందించారు. తెలంగాణ హకీ చైర్మెన్ గా రెండవ సారి కొండ విజయ్ కొనసాగాడనికి సర్వ సభ్య సమావేశంలో కమిటి సభ్యులు తీర్మానం చేశారు . తనకు అవకాశం రావడం పట్ల కొండ విజయ్ సంతోషం వ్యక్తం చేస్తూ, జాతీయ క్రీడ అయిన హకీ కి సేవ చేయడం కోసం మరొ సారి అవకాశం కల్పించినందుకు కమిటి కి దన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగనున్నాయి. ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలని ఎదురు చూస్తున్న హైదరాబాదిలకు తెరపడింది మంగళవారం మంత్రకేదార్ల మూడ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, సి ఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.
త్వరలో మరో మూడు డబుల డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనున్నారు. ఇంకా 20 బస్సులను తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) యోచిస్తోంది. ఒక్కొక్క బస్సు రూ.2.16 కోట్లు, దానితో పాటు 7 సంవత్సరాలు AMC వస్తుంది.
ఈ బస్సులలో డ్రైవర్లో పాడు 65 మంది ప్రయాణికులతో సిట్టింగ్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సులకు ఛార్జింగ్ సమయం 2 నుండి 2.5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల మార్గంలో నడపనున్నారు. ఈ నెల 11న ఫార్ములా ఇ-ప్రిక్స్ తో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్ , నెక్లెస్ రోడ్, ఫ్యారడైజ్, నిజాం కాలేజీ స్టేజీలను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరగనున్నాయి. ఈ బస్సులు హెరిటేజ్ సర్క్యూట్ లో ఉపయోగించాలని యోచిస్తున్నారు.
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రునగర్ కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కార్పొరేటర్ ని కోరారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, అభివృద్ధి ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రధమ కర్తవ్యం అని అన్నారు. కాలనీలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించడంతోపాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా కాలనీలో నెలకొన్న విద్యుత్ పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ మోహన్, ఎలక్ట్రికల్ లైన్మెన్ బ్రహ్మం, వాటర్ వర్క్స్ లైన్మెన్ నవీన్, ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్, డివిజన్ ఉపాధ్యక్షులు యాద గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, బసవరాజ్ లింగయత్, మల్కయ్య, రాజక్, ముంతాజ్ కాలా, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నిరూప, ఎస్సీ ప్రెసిడెంట్ నరసింహ, తుకారం, రాజు,పిల్లి యాదగిరి, గౌసియా, అబ్దుల్ గని, నరేష్, గఫూర్, అబ్దుల్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
*ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్యుమెంటరీ “బిలో ది బెల్ట్” హైదరాబాద్‌లో ప్రదర్శించబడుతుంది
* భారతదేశంలో హైదరాబాద్‌లో మొదటి స్క్రీనింగ్
*ఎండోమెట్రియోసిస్‌పై అవగాహన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది
*చిత్రం మార్చి 3 2023న ప్రదర్శించబడుతుంది
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : భారతదేశంలో సుమారు 25 మిలియన్లకు పైగా మహిళలు ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నారని ఇది మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం. ఎండోమెట్రియోసిస్ ప్రతి 10 మంది మహిళల్లో ఒకరికి ప్రభావితం చేస్తుంది. ఎండోమెట్రియోసిస్ 30-50% మంది మహిళలు వంధ్యత్వానికి కారణం అవుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళలు వంధ్యత్వం మరియు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎండోమెట్రియోసిస్‌పై మరింత అవగాహన కల్పించేందుకు, ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన “బిలో ది బెల్ట్” చిత్రాన్ని భారతదేశంలోని హైదరాబాద్‌లో ప్రదర్శిస్తోంది.
ఎండోమెట్రియోసిస్ అనేది దీర్ఘకాలిక వైద్య పరిస్థితి, దీనిలో గర్భాశయం వెలుపల కటి, ఉదరం, మూత్రాశయం, డయాఫ్రాగమ్, మెదడు వంటి ప్రాంతాల్లో ఎండోమెట్రియల్ కణజాలం పెరుగుతుంది. ఈ రుగ్మత మధుమేహం వలె ప్రబలంగా ఉంటుంది మరియు ప్రతి పది మంది మహిళల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఎండోమెట్రియోసిస్ విస్తృతమైన ప్రెజెంటేషన్లు, లక్షణాలు మరియు తీవ్రతలను కలిగి ఉంటుంది మరియు నొప్పి, వంధ్యత్వం మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, ఇది వ్యక్తి యొక్క జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, సాంప్రదాయ మరియు సామాజిక మాధ్యమాలలో ఎండోమెట్రియోసిస్ ఒక విస్మరించబడిన పరిస్థితిగా మిగిలిపోయింది, ఆధునిక కాలంలో కూడా సగటు రోగనిర్ధారణ సమయం 7 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది” అని డాక్టర్ విమీ బింద్రా ఫౌండర్ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తెలిపారు. ఎండోమెట్రియోసిస్ యొక్క తెలియని స్వభావాన్ని ఖచ్చితంగా EFI (ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. EFI అనేది పరిశోధనను పెంపొందించడానికి, మద్దతు నెట్‌వర్క్‌లను రూపొందించడానికి మరియు జాతీయ స్థాయిలో న్యాయవాద మరియు అవగాహనను పెంపొందించడానికి అంకితం చేయబడిన ఒక లాభాపేక్షలేని సంస్థ. అందువల్ల, పరిస్థితి యొక్క అదృశ్యతను ఎదుర్కోవడానికి, ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (EFI) ప్రశంసలు పొందిన “బిలో ది బెల్ట్” అనే డాక్యుమెంటరీని మార్చి 3, 2023న ప్రజల కోసం ప్రదర్శించాలని యోచిస్తోంది.
ఈ చిత్రం ఎండోమెట్రియోసిస్ సమస్య మరియు ఆ పరిస్థితి ఉన్నవారి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై చూపే ప్రభావంపై దృష్టి పెడుతుంది. డాక్యుమెంటరీ డైరెక్టర్, షానన్ కోన్, 16 సంవత్సరాల వయస్సులో ఎండోమెట్రియోసిస్ లక్షణాలను అనుభవించడం ప్రారంభించాడు, సంవత్సరాలుగా రోగనిర్ధారణ లేదా చికిత్సపై ఎటువంటి ఆశ లేకుండా. ఆమె క్షీణిస్తున్న ఆరోగ్యం కోసం సమాధానాన్ని వెతకడంలో ఆమె అనుభవం సాధారణ ప్రజలతో పాటు వైద్య సంఘంలో ఎండోమెట్రియోసిస్ అవగాహనను పెంచడానికి ఆమె జీవితకాల అభిరుచికి దారితీసింది.
హాజరైనవారు చలన చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది మరియు వ్యాధి మరియు అది అందించే సవాళ్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణులతో సంభాషణలో పాల్గొనవచ్చు. ఎండోమెట్రియోసిస్ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అదే పోరాటాలను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ముఖ్యమైన సమస్య గురించి మరింత తెలుసుకోవడానికి మరియు సంఘం యొక్క శక్తిని కనుగొనడానికి మీరు మాతో చేరతారని మేము ఆశిస్తున్నాము డాక్టర్ బింద్రా జోడించారు.
తెలంగాణ మిర్రర్, మాదాపూర్ : మాదాపూర్ శిల్పారామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యములో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ యువజనోత్సవాలను తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖమంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమములో పాల్గొని యువ కళాకారులను, క్రీడకారులను అభినందిస్తు జాతీయ స్థాయిలో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రతిభను చాటి చెప్పాలని కోరారు. యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్, డా.వాసం వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ వేణుగోపాల్ రావు, ఉప సంచలకులు, ఎన్.అనంత రెడ్డి ఇతర ముఖ్య అతిధులు పాల్గొన్నారు. ఈ పోటీలలో శ్రీమతి అరుణ సుబ్బారావు, లింగ శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
జానపద నృత్యం (గ్రూప్), జానపద గీతం (గ్రూప్) వక్తృత్వం అంశములలో 33 జిల్లాలలో జిల్లా స్థాయిలో గెలుపొందిన సుమారు 1000 మంది యువ కళాకారులు తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో జరిగిన యువజనోత్సవలలో కనపరిచారు. కబడ్డీ క్రీడ అంశం నందు ఎంపికలు జిమ్ ఖానా గ్రౌండ్స్, హైదరాబాద్ జిల్లా లో 33 జిల్లా స్థాయిలో గెలుపొందిన యువ క్రీడకారులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహించడం జరిగింది.
ఎంపికల వివరాలు…
జానపద నృత్యం (గ్రూప్) – ప్రథమ బహుమతి- కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
జానపద నృత్యం (గ్రూప్) – ద్వితీయ బహుమతి- మంచిర్యాల జిల్లా
జానపద నృత్యం (గ్రూప్) – తృతీయ బహుమతి- హైదరాబాద్ జిల్లా
జానపద గీతం (గ్రూప్) – ప్రథమ బహుమతి- నిజామాబాద్ జిల్లా
జానపద గీతం (గ్రూప్) – ద్వితీయ బహుమతి- వనపర్తి జిల్లా
జానపద గీతం (గ్రూప్) – తృతీయ బహుమతి- నిర్మల్ జిల్లా
వక్తృత్వం – ప్రథమ బహుమతి- ఏ.తన్వి, నిజామాబాద్ జిల్లా
వక్తృత్వం – ద్వితీయ బహుమతి-యం మౌనిక, కామారెడ్డి జిల్లా
వక్తృత్వం – తృతీయ బహుమతి-ఎన్.విష్ణు,నల్గొండ జిల్లా
వక్తృత్వం – తృతీయ బహుమతి-యం.స్నేహిత, జనగాం జిల్లా
వక్తృత్వం – తృతీయ బహుమతి- కె.ప్రశాంతి,సూర్యపేట జిల్లా
కబడ్డీ క్రీడ- బాలురు (12), బాలికలు (12)లను ఎంపిక చేయడం జరిగింది.
రాష్ట్ర స్థాయిలో యువజనోత్సవాలలో ప్రధమ బహుమతి గెలుపొందిన యువ కళాకారులు, క్రీడకారులు హుబ్లి, ధార్వాడ్ కర్ణాటక రాష్ట్రంలో జరుగు జాతీయ స్థాయి యువజనోత్సవాలలో జనవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగే పోటీలలో పాల్గొంటారు.
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ఆథ్లెటిక్ పోటీల్లో భాగంగా ఈ నెల 21.22 తేదిలలో మెదక్ లో ని ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించే 9 వ రాష్ర్ట ఆథ్లెటిక్ పోటీల్లో రంగారెడ్డి మాస్టర్లు ఏక్కువ సంఖ్యలో పథకాకాలు సాగించడం ఖాయమని రంగారెడ్డీ జిల్లా మాస్టర్ ఆథ్లెటిక్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. చందానగర్ లో రంగారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెటిక్ ఆసోయేషన్ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ రంగారెడ్డి నుండి 52 మాస్టర్లు పాల్గొనున్మట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే రంగారెడ్డి జిల్లామాస్టర్లకు 11 వ తేది నుండి చందానగర్ పిజెఆర్ స్టేడియంలో ఉదయం 8 నుండి 10 గంటలక వరకు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్, ట్రెజరర్ దర్మపూరి స్వాతి తో పాటు ఆసోసియేషన్ సభ్యురాల, జ్యోతి గౌడ్ బొమ్మ, స్వప్న కపూర్, నర్సింహ్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో పాల్గొని చరిత్ర సృష్టించిన శ్రీ చైతన్య విద్యాసంస్థ. భారత విద్యారంగంలో శ్రీచైతన్య అంటేనే ఒక సంచలనం. ఏది చేసినా విభిన్నంగా, వినూత్నంగా చేయటం అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా సాధించి అద్భుతాలను సృష్టించటం శ్రీచైతన్యకు అలవాటైన విద్య. ఇప్పటికే రెండు వరల్డ్ రికార్డులను సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 100 రోజుల శిక్షణతో 10 రాష్ట్రాలలోని 73 బ్రాంచీల నుండి 400 జూమ్ లింక్స్ ద్వారా 2000 కి పైగా ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ విద్యార్థులు పాల్గొని 1 నుండి 100 వరకు మ్యాథ్స్ టేబుల్స్ 100 నిమిషాలలోపు తిరిగి అప్పజెప్పి అందిరిని ఆశ్చర్యపరిచి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. దీనిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు పర్యవేక్షించి పరీక్షించి రికార్డును నమోదు చేశారు. అనంతరం సర్టిఫికెట్ ను ప్రదానం చేసి ప్రశంసించారు. దీంతో శ్రీచైతన్య హ్యాట్రిక్ ప్రపంచ రికార్డును సృష్టించిన స్కూల్ గా చరిత్రలో నిలిచింది.
ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ స్టూడెంట్స్ టీచర్స్ ఒక్కటై ఎంతో ఇష్టంతో కృషిచేయటం వల్లే ఇంతటి గొప్ప విజయం, వరల్డ్ రికార్డ్ సాధ్యమైందని తెలిపారు. శ్రీచైతన్య స్కూల్స్ అంటేనే గ్రేట్ ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనీ, ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిల్లోనే చిన్నారుల్లో దాగివున్న నైపుణ్యాలను మేగ్జిమమ్ వెలికితీయడం, సక్రమమైన మార్గంలో వారి ట్రెయిన్స్ని ట్రైన్ చేయటం, ఎలాంటి ఒత్తిడి లేకుండా వారిపై వారికి నమ్మకం పెంచుతూ చిన్న వయస్సు నుండే విజేతలుగా మార్చటం శ్రీచైతన్య స్కూల్స్ లక్ష్యమని తెలియజేశారు. శ్రీచైతన్య సైంటిఫిక్ మెథడ్స్, రీసెర్చ్ టేస్ట్ కరిక్యులమ్, వెల్ ప్లాన్ టీచింగ్ సిస్టమ్ మా విద్యార్ధుల్ని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో టాపర్స్ గా మారుస్తోందని, అందుకే తమకే ఇంతటి వరల్డ్ రికార్డులు సాధ్యమవుతున్నా యని వివరించారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు పాల్గొనే నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లోనూ వరుసగా 9 సంవత్సరం శ్రీచైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవటం శ్రీచైతన్య స్కూల్స్ ఆధిపత్యానికి నిదర్శనమని తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఈవెంట్లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు.
ఈ కార్యక్రమములో నల్లగండ్ల శాఖ మేవరిక్స్ విభాగానికి చెందిన విద్యార్ధులు పాల్గొని 28 మంది విజేతలుగా నిలిచారు. ఏ. జీ.యం శివరామకృష్ణ, అకాడమిక్ చీఫ్ హెడ్ పుష్పవల్లి, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా|| బి.ఎస్. రావు వరల్డ్ రికార్డ్ సృష్టించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, నిరంతరం కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు.
లబ్ధిదారులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలి. బీజేపీ నాయకులు…
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలైనా ఇవ్వకుండా ప్రజలను ఎన్నికలోచ్చినప్పుడల్ల ఇస్తామని మోసం చేస్తూ ఇంతవరకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కాలం గడుపుతున్న ప్రభుత్వానికి నిరసనగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని హఫీజ్ పేట్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బీజేపీ నాయకులు. అనంతరం మసీద్ బండ నుండి భారీ ర్యాలీగా వెళ్లి శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మండల తహశీల్దార్ కి డిప్యూటీ కమిషనర్ కి బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు.
*అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ..
*సీపీఎం ఆధ్వర్యం లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కి వినతి పత్రం..
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : నియోజక వర్గంలో పరిధిలో అర్హులకు డబుల్ బెడ్ రూం లు ఇవ్వాలి అని సీపీఎం నేతలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ని కోరారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. నియోజక వర్గంలో దాదాపు 25వేల మంది పేద మధ్య తరగతి ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో విపరీత మైన అద్దెలు పెరిగి పోయాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుల్ మోహర్ పార్క్ కాలనీ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు అలాగే ఖాళీగా ఉన్నాయి.
అనేక చోట్ల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురి అవుతోంది. నియోజక వర్గంలో చాలా చోట్ల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. అట్టి భూమి నీ డబుల్ బెడ్ రూం పథకానికి కేటాయించాలి అని కోరారు. నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధి దారులకు కేటాయించాలని వినతి పత్రం లో కోరారు.
ఈ కార్యక్రమం లో సీపీఎం జోన్ కార్యదర్శి సి. శోభన్, జోన్ కమిటీ మెంబెర్స్ కె. కృష్ణ, ఎస్. రవి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ మిర్రర్, మాదాపూర్ : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్బంగా శనివారం సందర్శకులు భారీ సంఖ్యలో సందర్శించారు. జనస్పందన ఎంతగానో ప్రోత్సహకారంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత హస్త కల ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేతకు హస్త కళాకారులకి చేయూతనిస్తున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కాకినాడ నుండి విచ్చేసిన నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణ కుమార్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పద్మశ్రీ మరియు సంగీత నాటక అకాడమీ అవార్దీ శ్రీమతి ఆనంద శంకర్ జయంత్ శిష్య బృందం చే భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.